హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అందరికీ ఇసుక అందుబాటులో ఉంచాలి: కలెక్టర్

ATP: జిల్లాలో ఎలాంటి కొరత లేకుండా అందరికీ ఇసుక అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కంబదూరు మండలం నూతిమడుగు, కర్తలపర్తి ఓపెన్ సాండ్ రీచ్‌లకు సంబంధించి అనుమతులు, టెండర్ల ప్రక్రియపై నిర్ణయాలు తీసుకున్నారు.