హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెగా డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఆగదు: ఎమ్మెల్సీ

NLR: మెగా డీఎస్సీలో అక్రమాలపై శాసనమండలిలో చర్చ జరిగే వరకు వైసీపీ పోరాటం ఆగదని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి అన్నారు. మండలిలో డీఎస్సీ అంశంపై చర్చకు కూటమి ప్రభుత్వం ముందుకు రాకుండా గందరగోళం సృష్టించిందని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారని, SCRT ఉద్యోగి నవీన్కు డీఎస్సీలో మొదటి ర్యాంక్ రావడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.