హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూ రీ-సర్వే వేగవంతం చేయాలి: జేసీ

PPM: జిల్లాలో చేపడుతున్న రీ-సర్వే పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ అర్జీలను ప్రాధాన్యతా క్రమంలో వేగంగా పరిష్కరించాలని జేసీ ఆర్‌.వైశాలి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ఛాంబరులో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, పార్వతీపురం ఆర్‌డీఓ మాధురి, జిల్లాలోని తహసీల్దార్లతో రీ-సర్వేపై సమీక్ష నిర్వహించారు.