హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా దంపతులకు గట్టి షాక్

ముఖ్యమంత్రి రేవంత్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో కొండా దంపతులకు గట్టి షాకిచ్చారు. పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ MLA రేవూరి ప్రకాష్‌ని గెలిపించాలంటూనే కోరారు. పరకాల నడిబొడ్డులో ఈ ప్రకటన చేయడం కొండా వర్గానికి మింగుడుపడని అంశంగా భావిస్తున్నారు. ఇలాంటి వింత పరిణామాలు, చర్చలన్నీ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమంటూ ప్రజలు సెటైర్ వేస్తున్నారు.