హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెల్‌స్టార్ గోల్డ్ లోన్ బ్యాంకు ప్రారంభం

KRNL: తుగ్గలి మండల కేంద్రంలో బెల్‌స్టార్ గోల్డ్ లోన్ బ్యాంకు శాఖను బీజేపీ జిల్లా నాయకుడు మాదిరెడ్డి నవీన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. బంగారు ఆభరణాలపై ప్రజలకు సులభంగా, వేగంగా రుణాలు అందుబాటులోకి రావడం సంతోషకరమని నవీన్‌రెడ్డి తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బ్యాంకు నిబంధనలకు లోబడి మెరుగైన సేవలు అందిస్తామని అధికారులు తెలిపారు.