KRNL: పెద్దకడబూరు (మం) బసలదొడ్డిలోని సర్వే నంబర్ 89లో దళితులకు కేటాయించిన భూముల ఆక్రమణపై గ్రామస్థులు పీజీఆర్‌ఎస్‌లో MRO వలీభాషకు ఫిర్యాదు చేశారు. మాజీ వీఆర్వో లంకారెడ్డి సుమారు 12 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి దళితులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అలాగే వైసీపీ మాజీ జడ్పీటీసీ వై.బాలరంగస్వామి సైతం స్థలం ఆక్రమించి ఇల్లు నిర్మించారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దళితుల భూముల ఆక్రమణపై ఫిర్యాదు


