హైదరాబాద్: 28°C
తెలంగాణ

బేస్ లైన్ డేటా కీలకం: కలెక్టర్

NRPT: గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల స్థాయిలో సమగ్ర బేస్ లైన్ డేటా సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. మౌలిక వసతులు, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధి ప్రణాళికలకు ఈ డేటా కీలకమని తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సూచనలు చేశారు.