NRPT: అత్యవసర పరిస్థితుల్లో జాతీయ టోల్ ఫ్రీ నంబర్ 112ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని SI వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని సత్యనారాయణస్వామి కూడలిలో 112పై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో 112కు ఫోన్ చేసి ఘటన వివరాలను తెలియజేయాలని, సిబ్బంది అడిగే సమాచారం అందించాలని సూచించారు. తక్షణమే స్పందిస్తామని తెలిపారు.
తెలంగాణ
టోల్ ఫ్రీ నంబర్ సద్వినియోగం చేసుకోవాలి: SI


