హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చుట్టూ నీరున్నా సాగుకు అందని వైనం

NDL: నందికొట్కూరు నియోజకవర్గంలో రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌ను విడుదల చేశారు. అయితే ఎత్తిపోతల పథకం వద్ద మోటార్ సామగ్రి మూలన పడటంతో నీటిని పొలాలకు తరలించలేని పరిస్థితి నెలకొంది. చుట్టూ నీరు ఉన్నా సాగుకు వినియోగించుకోలేక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.