SRCL: వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని “తాడు ఆట” పేరుతో జూదం నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హనుమకొండ జిల్లా ఐనవోలుకు చెందిన రాయపురం సురేందర్, ఆత్మకూరుకు చెందిన పల్లకొండ దేవేందర్‌ను అదుపులోకి తీసుకుని, తాడు ఆట సామగ్రి, అప్సర పెన్సిళ్లు, రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
తాడు ఆట పేరుతో జూదం.. ఇద్దరి అరెస్ట్


