హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ అగ్ర నేతల వైఖరిని ఖండిస్తూ BJYM నిరసన

KNR: వందేమాతరం ఆలాపన సమయంలో కాంగ్రెస్ అగ్రనేతల వైఖరిని ఖండిస్తూ కరీంనగర్ కోర్టు చౌరస్తాలో సోమవారం బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు సంగ నరేష్ మాట్లాడుతూ.. జాతీయ గేయాన్ని అవమానించడం దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.