హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన కల్వర్టు నిర్మాణానికి మున్సిపల్ ఛైర్మన్ భూమి పూజ

JGL: మెట్పల్లిలోని 19వ వార్డులో శిధిలావస్థలో ఉన్న కల్వర్టును తొలగించి నూతన కల్వర్టు నిర్మాణానికి మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి సోమవారం భూమి పూజ చేశారు. పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ బోడ్ల ఆనంద్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, డీఈ నాగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.