హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: ఉదయ్ రెడ్డి

SDPT: మద్దూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై బీజేపీ మండలాధ్యక్షుడు ఉదయ్ రెడ్డి, బీజేవైఎం నాయకుడు మనోజ్ స్పందించారు. అధికారులతో కలిసి పాఠశాలను పరిశీలించిన వారు భోజన నాణ్యత, వసతులపై ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు.