హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చింతల్‌సాంగ్వి బ్రిడ్జి పునర్నిర్మించాలి'

ADB: బజార్ హత్నూర్ మండలం చింతల్‌సాంగ్వి సమీపంలోని బ్రిడ్జిని త్వరగా పునర్నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి ఎత్తు తక్కువగా ఉండటంతో వరదల సమయంలో రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. బ్రిడ్జి సమీపంలో పెద్ద గుంతలు ఏర్పడటంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.