JGL: బీజేపీ బలోపేతానికి నాయకులు కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచించారు. కోరుట్ల నియోజకవర్గ బీజేపీ నాయకులు సోమవారం ఆయనను కలిశారు. స్థానిక సమస్యలపై పోరాడాలని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, అనుప్ రావు, అరుణ, నవీన్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి'


