AKP: దేవరాపల్లి గరిసింగిలో ఇళ్ల సందులో చేరిన 13 అడుగుల భారీ గిరినాగును చూసి స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే చోడవరం అటవీ శాఖ, తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితికి సమాచారం ఇచ్చారు. సమితి సభ్యులు ప్రసాద్, కృష్ణ, ఇషాక్ అక్కడకు వచ్చి అరగంట శ్రమించి పామును పట్టుకున్నారు. అనంతరం దానిని చీడికాడ సమీప దట్టమైన అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఇంట్లోకి వచ్చిన భారీ గిరినాగు


