హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ముస్లింల శ్మశాన సమస్య పరిష్కరించాలి'

కర్నూలు మండలం ఉల్చాలలోని ముస్లింల శ్మశాన స్థల సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ సిరికి వినతిపత్రం అందజేశారు. సమస్యపై తహసీల్దార్ తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపిస్తూ.. చర్యలు తీసుకోవాలని కోరారు. శ్మశాన స్థల గోడ కూల్చిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.