హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో ఉచిత ఆక్యుపంక్చర్ వైద్య శిబిరం

BPT: రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో ఈ నెల 22,23 తేదీల్లో ఉచిత ఆక్యుపంక్చర్ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు తెలిపారు. విజయలక్ష్మిపురంలోని రోటరీ కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి డాక్టర్ నీలిమ ప్రియదర్శిని వైద్యాధికారిగా సేవలందిస్తారు. కీళ్ల నొప్పులు, మైగ్రేన్, ఇతర సమస్యలు ఉన్నవారు ముందస్తు నమోదు చేసుకోవాలన్నారు.