హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలంలో తూర్పు వైపు నుంచే ప్రవేశాలు

BDK: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించే భక్తులను ఇకపై రామాలయం తూర్పు వైపు నుంచి అనుమతిస్తారు. లోపలికి వెళ్లే భక్తులు రామయ్య, అంజన్న దర్శనం అనంతరం మళ్లీ తూర్పు వైపు నుంచే బయటకు రావాల్సి ఉంటుంది. రామాలయ విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా పడమర మెట్లు తొలగిస్తున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా ఈ ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు నేడు తెలిపారు.