హైదరాబాద్: 28°C
తెలంగాణ

"పరీక్ష కేంద్రంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి"

BDK: జిల్లాలో ఈ నెల 30న నిర్వహించనున్న నీట్-పీజీ–2026 పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు, సాంకేతిక అంతరాయాలకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు చేపడతారని అన్నారు.