హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వర స్వామిని దర్శించుకున్న 46, 558 మంది భక్తులు

SRCL: శ్రావణమాసం పురస్కరించుకొని వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. ఏపీ, ఛత్తీస్‌ఘడ్ పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. క్యూ లైన్లలో 4 నుంచి 6 గంటలు వేచి దర్శనం చేసుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు 46,558 మంది దర్శించినట్లు ఈవో రమాదేవి తెలిపారు.