MBNR: కౌకుంట్ల ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ ఉత్తర్వు నంబర్-4 మేరకు సోమవారం తొలి ప్రజావాణి నిర్వహించారు. తహసీల్దార్ సుందర్‌రాజ్, ఎంపీడీవో శివప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం జరిగింది. రెవెన్యూ, పంచాయతీ శాఖలకు సంబంధించి రెండు అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని తహసీల్దార్ పేర్కొన్నారు.
తెలంగాణ
MPDO కార్యాలయంలో తొలి ప్రజావాణి


