హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: వేణు రెడ్డి

SS: లేపాక్షి మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్య నేత గుడ్డంపల్లి వేణు రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొని పార్టీ విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.