హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చట్టపరిధిలో తక్షణమే చర్యలు తీసుకోవాలి: ASP

VZM: బాధితుల సమస్యలను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించాలని అదనపు ఎస్పీ పీ.సౌమ్యలత పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 31 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూతగాదాలకు సంబంధించి 14, కుటుంబ కలహాలు 5, మోసాలకు సంబంధించి 6, ఇతర సమస్యలపై 6 ఫిర్యాదులు వచ్చాయన్నారు.