హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పంచాయతీ కార్మికులకు రూ.26 వేల వేతనం డిమాండ్'

SRPT: హుజూర్‌నగర్‌లో పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎంపీడీవో సుమంత్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. కార్మికులను పర్మినెంట్ చేసి నెలకు కనీసం రూ.26 వేల వేతనం ఇవ్వాలని కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయడంతో పాటు జీవో 51ను సవరించి గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 18, 19న రాష్ట్రవ్యాప్త దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.