RR: కేశంపేట మండలం నిర్దవెల్లిలో రెండు ఇందిరమ్మ ఇళ్లకు సోమవారం ఘనంగా గృహప్రవేశం నిర్వహించారు. లబ్ధిదారులు కొత్త సుజాత, కాలే సంతోష నూతన గృహాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
'అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లిస్తాం'


