హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అవినీతిపై కలెక్టర్‌కు ఫిర్యాదు'

NLG: చిట్యాల మండలం సుంకెనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండ్రాంపల్లి పీఏసీఎస్ సిబ్బంది, రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో రూ. 15 లక్షల అవినీతికి పాల్పడ్డారని రైతులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తరుగు పేరిట క్వింటాల్‌కు 7 కిలోలు కోత కోస్తూ, ఖాతాల్లో తక్కువ డబ్బులు జమ చేసి మోసం చేశారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.