KMM: జిల్లాలోని గురుకులాల సమస్యలను పరిష్కరించాలని PDSU జిల్లా అధ్యక్షుడు జి. మస్తాన్ డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీజకు వినతిపత్రం అందజేశారు. గురుకులాలలో అనేక సమస్యలతో పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరిపడ గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న జిల్లా అధికారులు పట్టించుకోవటం లేదని అన్నారు.
తెలంగాణ
గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలి: PDSU


