హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీ హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలి'

SS: జిల్లాలోని 61 బీసీ హాస్టళ్లకు కేవలం 26 మంది వార్డెన్లు మాత్రమే ఉన్నారని విద్యార్థి సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఒక్కో వార్డెన్‌కు రెండు, మూడు హాస్టళ్ల అదనపు బాధ్యతలు అప్పగించడంతో విద్యార్థుల ఆహారం, పరిశుభ్రత, ఆరోగ్యం, భద్రతపై ప్రభావం పడుతోందన్నారు. ఖాళీ పోస్టుల వివరాలు సేకరించి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖకు నివేదిక పంపాలని కోరారు.