హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీఆర్ఎస్‌లో 70 ఫిర్యాదుల స్వీకరణ

SS: ప్రజలకు సత్వర న్యాయం అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌)లో ప్రజల నుంచి 70 ఫిర్యాదులను స్వీకరించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.