హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'న్యాయం చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం'

E.G: మెడికో ప్రియాంక మృతి కేసులో ప్రకాష్ నగర్ సీఐ బాజీలాల్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. సోమవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 3న ప్రమాదం జరిగితే, 6 వరకు నిందితులను ఎందుకు రిమాండ్‌కు తరలించలేదని మండిపడ్డారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.