హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి 80 ఫిర్యాదులు: కలెక్టర్

NZB: సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజల నుంచి వినతులను స్వీకరించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ పేర్కొన్నారు.