హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన స్థలాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ATP: సీఎం చంద్రబాబు ఈ నెల 22న జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో కలెక్టర్ ఓ. ఆనంద్, ఎస్పీ పి. జగదీష్ సోమవారం కొర్రపాడు, సిద్దరాంపురం గ్రామాల్లో స్థల పరిశీలన చేశారు. గురుకుల, జిల్లా పరిషత్ పాఠశాలలతో పాటు ఎస్.డబ్ల్యు.పి.సి షెడ్లను తనిఖీ చేశారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణం కోసం భూములను పరిశీలించి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.