హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

థియోసాఫికల్ కళాశాల కోసం కేంద్ర మంత్రికి వినతి

అన్నమయ్య: రవీంధ్రనాథ్ ఠాగూర్‌ బస చేసిన మదనపల్లె బిసెంట్ థియోసాఫికల్ కళాశాల ప్రాంతాన్ని జాతీయ వారసత్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వినతిపత్రం అందించారు. స్మారక భవనం, మ్యూజియం, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రవికుమార్‌, అజమతుల్లాఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.