బంగ్లాదేశ్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియాకు మరో షాక్ తగలనుంది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టు 44 వేల డాలర్ల జరిమానాతో పాటు 4 పాయింట్ల కోత ఎదుర్కొనే అవకాశం ఉంది. మూడో రోజు 4 ఓవర్లు తక్కువ వేయడంతో ఒక్కో ఓవర్‌కు ఒక పాయింట్ చొప్పున కోత పడనుంది. దీనిపై ఐసీసీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత WTCలో 84 పాయింట్లతో టాప్‌లో ఉన్న ఆసీస్‌కు ఇది పెద్ద దెబ్బే.
క్రీడలు
'కంగారూ'లకు షాక్..!


