హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలుడి కేకలు విని..కాపాడాం: మత్స్యకారులు

E.G: రాజమండ్రి సమీపంలో గోదావరిలో అర్ధరాత్రి ఈదుకుంటూ కేకలు వేస్తున్న బాలుడు కార్తీకను మత్స్యకారులు రక్షించారు. చేపల వేటలో ఉన్న సమయంలో కేకలు వినిపించడంతో పడవలో వెళ్లి బాలుడిని ఒడ్డుకు చేర్చినట్లు మత్స్యకారులు మీడియాకు తెలిపారు. అనంతరం బాలుడిని రాజమండ్రి టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. అతడి కుటుంబ సభ్యుల కోసం వెతికినా ఆచూకీ లభించలేదన్నారు.