TPT: తిరుమల PAC-1 వద్ద పూల వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. భక్తుల సమక్షంలో వ్యాపారులు బూతులు తిట్టుకుంటూ రెచ్చిపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరమ పవిత్రమైన తిరుమలలో ఇలాంటి భాష మాట్లాడటంపై మండిపడ్డారు. ఘటనలు తరచూ జరుగుతున్నా విజిలెన్స్ అధికారులు అప్పుడప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
భక్తుల మధ్య వ్యాపారుల వాగ్వాదం


