హైదరాబాద్: 28°C
క్రైమ్

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐటీ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.