పశ్చిమ బెంగాల్ తారాపీఠ్‌లో తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ నాలుగంతస్తుల హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ శాతం ఆలయానికి వచ్చిన భక్తులే ఉన్నారు. వారంతా గాఢనిద్రలో ఉండగా, షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
క్రైమ్
ఘోర ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం


