హైదరాబాద్: 28°C
క్రైమ్

13 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్

TG: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా 13మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల సిబ్బంది 13మంది విద్యార్థినులను అంబులెన్స్‌లో చేర్యాల ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. కాగా పాఠశాలలో 6 నుంచి ఇంటర్‌ వరకు 250 మంది విద్యార్థినులు చదువుతున్నారు.