హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ రహదారిలో వెళ్తే నరకమే..!

ASR: జి. మాడుగుల మండలంలోని భీరం నుంచి దిగవీధికి వెళ్లే మార్గం చిత్తడిగా మారింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రహదారి బురదమయంగా తయారైంది. అటుగా వెళ్లేందుకు గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు పక్కన నిలిపి కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మార్గంలో సీసీ రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.