ASR: హుకుంపేట మండలం బూర్జ పంచాయతీలో అంగన్వాడి భవనం నిర్మాణం ఆరేళ్లుగా పూర్తికాక నిరుపయోగంగా మారింది. స్లాబ్, గోడల నిర్మాణం అసంపూర్తిగా ఉండగా భవనం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. సొంత భవనం లేక చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. నిర్మాణం ఎందుకు నిలిచిపోయిందో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆరేళ్లుగా పూర్తికాని అంగన్వాడీ భవనం


