హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాలు సమృద్ధిగా కురవాలని కప్పతల్లి ఊరేగింపు

AKP: నాతవరం మండలం డి.యర్రవరంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ.. గ్రామస్థులు, యువత ఆధ్వర్యంలో కప్పతల్లి ఊరేగింపు నిర్వహించారు. రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి, ప్రధాన వీధుల్లో సాంప్రదాయబద్ధంగా ఊరేగించారు. మహిళలు పసుపు నీటితో స్వాగతం పలికారు. పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువత పాల్గొన్నారు.