AP: కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామం నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు గల్లంతైంది. ఈనెల మూడో తేదీన ఓడలరేవు తీరం నుంచి ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో మెరైన్ పోలీసులకు, మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
క్రైమ్
మత్స్యకారుల బోటు గల్లంతు


