హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్బీఐ నిబంధనలపై అవగాహన

ప్రకాశం: కంభం పట్టణంలోని ఎన్‌బీఎఫ్‌సీ (NBFC) శాఖలను కంభం ఎస్సై శివ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించి, రుణాల మంజూరు, రికవరీ సమయంలో ఆర్బీఐ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్‌ను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. రుణాల వసూళ్ల సందర్భంగా ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించడం, బెదిరించడం లేదా ఇబ్బందులకు గురిచేయడం చేయరాదని స్పష్టం చేశారు.