BDK: దమ్మపేట MRO కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు,నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాన్ని నిలిపివేస్తుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పలు డిమాండ్‌లతో కూడిన మెమొరాండంను డిప్యూటీ తహసీల్దార్‌కు అందజేశారు.


