హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరణ

NGKL: ఉర్కొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. రాచపల్లికి చెందిన రాధాకృష్ణ రెవెన్యూ సమస్యపై తొలి దరఖాస్తు సమర్పించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.