హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లిలో సమస్యలపై అర్జీల స్వీకరణ

అనకాపల్లి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ విజయకృష్ణన్ అధ్యక్షతన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సత్యనారాయణరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.