హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సదుంలో మిథున్‌రెడ్డి పాదయాత్ర

CTR: సదుం మండలంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ఎంపీ మిథున్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం సదుం పంచాయతీ కార్యాలయం వరకు పాదయాత్రగా సాగుతూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.