హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో కార్మికుల కోసం సీపీఐ ధర్నా

అన్నమయ్య: రాయచోటిలో అర్హులైన ఆటో కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయినా ఆటో కార్మికులకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వాలన్నారు.